Namaste NRI

 ఆ క్రెడిట్‌ నాదే : డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికాలో అబార్షన్‌ హక్కుల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై 50 రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ తీర్పుపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు. ఇది దైవ నిర్ణయమంటూ వ్యాఖ్యనించిన ఆయన కాసేటికే ఆ క్రెడిట్‌ తనదే దక్కాంటూ కామెంట్‌ చేశాడు. రాజ్యాంగాన్ని అనుసరించడం అంటే ఇదే. చాలా కాలం క్రితం ఇవ్వాల్సిన హక్కులంటూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.  ఒక తరంలో జీవితానికి అతిపెద్ద విజయం. నేను వాగ్దానం చేసినట్లుగా అన్నింటినీ అందించడం వల్లనే ఇది సాధ్యమైంది.  ముగ్గురు బలమైన రాజ్యాంగకర్తలను యునైటెడ్‌ స్టేట్స్‌ సుప్రీం కోర్ట్‌ను నేనే ధృవీకరించాను. అది గౌరవంగా భావిస్తున్నా. నా వల్లే ఇప్పుడు ఇలా తీర్పు రావడం సంతోషంగా ఉందని అని పేర్కొన్నాడు ట్రంప్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events