Namaste NRI

ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికే : కిషన్ రెడ్డి

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ రోగుల వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు 58 కోట్ల టీకాలను పంపిణీ చేశామన్నారు. తెలంగాణకు 1,68,61,809 డోసులను కేంద్రం ఇచ్చిందని, మరో 13 లక్షల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి సరిపడా డోసులను ఇవ్వడం లేదనే ఆరోపణ అవాస్తమన్నారు. 18 ఏళ్ల వయసు లోపు వారికి కొవిడ్‌ టీకా ట్రయల్‌రన్‌ సక్సెస్‌ అయిందని, త్వరలో చిన్నారులకు వ్యాక్సిన్‌ అందిస్తామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని 19 వ్యాక్సిన్‌ సెంటర్లలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ రాజారావు, డిప్యూటీ నర్సింహరావు నేత, నోడల్‌ అధికారి ప్రభాకర్‌ రెడ్డి, ఆర్‌ఎంఏ నరేందర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.             

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]