Skip to main content

Namaste NRI

అంటే సుందరానికీ  ట్రైలర్‌ డేట్‌ కాన్ఫార్మ్‌

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నజ్రియా  హీరోయిన్‌గా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ చిత్రం అంటే సుందరానికి. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెప్పాన్స్‌ వచ్చింది. ఇందులో భాగంగా జూన్‌ 2న చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త ప్రచార చిత్రాన్ని నెట్టింట పంచుకున్నారు. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో నాని బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ యువతిగా కనిపించనున్నారు. సంగీతం: వివేక్‌ సాగర్‌, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మిరెడ్డి. ఈ చిత్రం తమిళంలో ఆడాడే సుందరా, మలయాళంలో ఆహా సుందరా పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా జూన్‌ 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events