Skip to main content

Namaste NRI

ఆ పేరు మా బాధ్యతని పెంచింది :నితిన్‌-భరత్‌

యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటిస్తున్న చిత్రం  అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. దర్శకులుగా పరిచయమవుతున్నారు నితిన్‌-భరత్‌.  ఈ సందర్భంగా దర్శకులిద్దరూ విలేకరులతో ముచ్చటించారు. తాము బుల్లితెరపై డిఫరెంట్‌ షోస్‌ చేశామని, అప్పటి నుంచే ప్రదీప్‌తో పరిచయం ఉందని చెప్పారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అని, గ్రామీణ నేపథ్యంలో చక్కటి హాస్యంతో మెప్పిస్తుందని అన్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే పేరు మా బాధ్యతని పెంచింది. ఈ సినిమాలో కామెడీ చాలా సహజంగా ఉంటుందని, బ్రహ్మానందం, సత్య పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయని తెలిపారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ఈ సినిమా బాగా నచ్చిందని, వేసవి రిలీజ్‌ బాగుంటుందని వారే సలహా ఇచ్చారని, ఫ్యామిలీ అంతా కలిసి చూసే పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్‌ వంటి టాప్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది. రథన్‌ మ్యూజిక్‌ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమా రిలీజ్‌ తర్వాతే మరో సినిమా డైరెక్షన్‌ గురించి ఆలోచిస్తాం. కొన్ని కథలైతే సిద్ధంగా ఉన్నాయి  అని పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News