Skip to main content

Namaste NRI

చియాన్‌ వచ్చేది అప్పుడే

చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం తంగలాన్.  పా రంజిత్ దర్శకత్వం  వహిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.  చియాన్ విక్రమ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. విక్రమ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో తన నటనతో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన తంగలాన్ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతు న్నట్లు చిత్రబృందం వెల్లడించారు. ఈ  సినిమాను జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Social Share Spread Message

Latest News