Skip to main content

Namaste NRI

రామారావు ఆన్‌ డ్యూటీ వచ్చేది అప్పుడే

రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్‌ డ్యూటీ. రజిషా విజయన్‌, దివ్యాంక కౌశిక్‌ నాయికలుగా నటిస్తున్నారు. శరత్‌ మండవ దర్శకుడు. నటుడు వేణు తొట్టెంపూడి, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో సినిమా ఆకట్టుకుంటుంది. రవితేజ సినిమా నుంచి కోరుకునే కమర్షియల్‌ అంశాలన్నీ ఉంటాయి అన్నారు. ఇందులో రవితేజ శక్తిమంతమైన ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్టీ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని జూలై 29న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడిరచింది. ఈ సినిమాకి సంగీతం: సామ్‌ సి.ఎస్‌,  కూర్పు: ప్రవీణ్‌ కేఎల్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.

Social Share Spread Message

Latest News