Skip to main content

Namaste NRI

ఏడుగురు మహిళల అద్భుత ప్రయాణం.. ఆకట్టుకుంటున్న హ్యాపీ జర్నీ టీజర్

ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని నిర్మిస్తున్న ఎమోషనల్‌ డ్రామా హ్యాపీ జర్నీ. గుత్తా ప్రొడక్షన్స్‌, కమలాకర్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకాలపై బాలాజీ గుట్ట, కౌశిక్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిరామ్‌ నాయుడు దర్శకుడు. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్‌ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్‌, సునయన ప్రధాన పాత్రధారులు. పృథ్వీ దండమూడి, వంశీధర్‌ గౌడ్‌, రవి శివతేజ పైలా కీలక పాత్రధారులు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటీమణులు అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, సునయన, నటుడు వంశీధర్‌గౌడ్‌ ఆనందం వెలిబుచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. టీజర్‌ చూసి ఇది అమ్మాయిల కోసం తీసిన సినిమా అనుకుంటే పొరపాటే. ఇది అబ్బాయిల కోసం తీసిన సినిమా. స్త్రీలు బయటకు చెప్పలేని ఎన్నో భావోద్వేగాలను ఇందులో చూపించాం. కుటుంబంతో కలిసి చూస్తే మంచి అనుభూతినచ్చే సినిమా ఇది అని దర్శకుడు అభిరామ్‌ నాయుడు నమ్మకంగా చెప్పారు. ఇంకా సహ నిర్మాత తరుణ్‌రెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి: కెమెరా: మణికందన్‌ సుబ్రమణియన్‌, సంగీతం: శేఖర్‌చంద్ర.

Social Share Spread Message

Latest News