పవన్‌కల్యాణ్ హరిహరవీరమల్లు కు చెందిన కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెల 14 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో స్టంట్ కొరియోగ్రఫర్ సిల్వ నేతృత్వంలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు వారు తెలిపారు. ఈ చిత్రీకరణలో దాదాపు 500మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారని, మరికొద్దిరోజుల్లో పవన్‌కల్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటారని దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పారు.
మునెపెన్నడూ చూడని విధంగా ఓ అద్భుతమైన యోధుడిగా పవన్‌కల్యాణ్ ఇందులో కనిపిస్తారని, ఆయన కెరీర్‌లోనే తొలి ఫిక్షనల్ మూవీ ఇదని, అన్ని కార్యక్రమాలనూ త్వరితగతిన పూర్తి చేసి త్వరలోనే హరిహరవీరమల్లు పార్ట్ 1 ను విడుదల చేస్తామని జ్యోతికృష్ణ తెలిపారు. బాబీడియోల్, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఎ.దయాకర్‌రావు, సమర్పణ: ఏ.ఎం. రత్నం, నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్.