Namaste NRI

ఘరానా మొగుడు ప్రారంభం

మోహన్‌ కృష్ణ, వర్ష విశ్వనాథ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ఘరానా మొగుడు. రాజుబాబు దర్శకుడు. మోహనకృష్ణ నిర్మాత. హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తుపు సన్నివేశానికి జెమిని సురేష్‌ కెమెరా స్విఛాన్‌ చేయగా, సాగర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ చిరంజీవి టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి అని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ సినీ దర్శకుడి జీవనగమనానికి చక్కని దృశ్యరూపమిది. ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కన్న అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఆకట్టుకుంటుంది. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ మిళితమై సాగుతుంది అని తెలిపారు. కథను హీరోగా నమ్మి ఈ సినిమా చేస్తున్నామని మోహన్‌కృష్ణ అన్నారు. రావురమేష్‌ జీవీ సుధాకర్‌ నాయుడు ముఖ్య పాత్రలి పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఘనశ్యామ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress