భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఫ్గానిస్తాన్ సమస్యపై ప్రధానంగా చర్చించారు.అఫ్గానిస్తాన్ తీవ్రవాదానికి నిలయంగా మారుతుందేమోనని సభ్య దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే న్యూ ఢల్లీి డిక్లరేషన్ తీర్మానం చేశాయి. దీని ప్రకారం ఆఫ్ఘన్‌లో శాంతిని తీసుకొచ్చేందుకు బ్రిక్స్ సభ్య దేశాలు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగా అఫ్గానిస్తాన్‌లో ప్రజా శాంతి, లా అండ్ ఆర్డర్‌ను అమలు చేసే విధంగా ప్రస్తుతం అధికారం చేజిక్కించుకున తాలిబన్లతో మాట్లాడాలని తీర్మానించాయి.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న పరిస్థితిపై బ్రిక్స్ సభ్యదేశాలన్నీ ఓ నిర్ణయానికి వచ్చాయని, అఫ్ఘానిస్తాన్‌కు సంబంధించి భారత్ ప్రతిపాదించిన ఓ ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్‌ను సభ్య దేశాలన్నీ ఒప్పుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించేందుకు బ్రిక్స్ సదస్సు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మనం గళంగా నిలిచాం. అలాగే ఆయా దేశాలకు ఏది ముఖ్యం అనే విషయాలపై దృష్టి కేంద్రీకరించేందుకు బ్రిక్స్ వేదిక ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అని అన్నారు.