చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ప్రముఖ వాణిజ్య నగరం షాంఘై దానికి కేంద్ర బిందువుగా మారింది. దీంతో నగరంలో గత కొన్నిరోజులుగా కఠినంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నది. 26 మిలియన్లకుపైగా జనాభా తమ ఇండ్లకే పరిమితమైంది. కాగా, షాంఘైలో వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా స్థానిక అధికారులు వింత ఆంక్షలు విధించారు. ఈ రోజు రాత్రి నుంచి జంటగా ఒకేచోట పడుకోవద్దని, కౌగించుకోకూడదని, ముద్దులు పెట్టుకోవడానికి వీళ్లేదని ప్రకటించారు. ఈ మేరకు అధికారులు వీధుల్లో తిరుగుతూ చాటింపు వేశారు.














