Skip to main content

Namaste NRI

క్లైమాక్స్ కట్టిపడేస్తుంది: కోన వెంకట్

హర్ష్‌ రోషన్‌, శ్రీదేవీ జంటగా మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌ మీద కోన వెంకట్‌ రూపొందించిన చిత్రం బ్యాండ్‌ మేళం. సతీష్‌ జవ్వాజీ దర్శకుడు.ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. కోన వెంకట్‌ మాట్లాడుతూ ఈ కథలోని సంఘర్షణ కొత్తగా ఉంటుంది. ైక్లెమాక్స్‌ ఘట్టాలు హృదయానికి హత్తుకుంటాయి. దర్శకుడు సతీష్‌ కథ చెప్పినప్పుడు తప్పకుండా గొప్ప చిత్రంగా మిగిలిపోతుందనే నమ్మకం కలిగింది అన్నారు.

ఈ కార్యక్రమానికి తమన్‌, శివాజీ అతిథులుగా హాజరయ్యారు. ఇది పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ విలేజ్‌ స్టోరీ అని, ప్రతీ ఎమోషన్‌ పీక్‌లో ఉంటుందని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతుందని హీరో హర్ష్‌ రోషన్‌ తెలిపారు. మనసుని కదిలించే ప్రేమకథ ఇదని దర్శకుడు తెలిపారు. మార్చి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, నిర్మాణ సంస్థ: కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, సమర్పణ: మ్యాగో మాస్‌ మీడియా, రచన-దర్శకత్వం: సతీష్‌ జవ్వాజి.

Social Share Spread Message

Latest News