Skip to main content

Namaste NRI

ఆస్కార్ అందుకున్న మొదటి నల్లజాతీయుడు ఇక లేరు

ఆస్కార్‌ అవార్డును అందుకున్న మొదటి నల్లజాతి నటుడు సిడ్నీ పోయిటియర్‌ (94) కన్ను మూశారు. లిల్లీస్‌ ఆఫ్‌ దర ఫీల్డ్‌లో తన నటనకు 1964లో ఉత్తమ నటుడిగా సిడ్నీ ఈ అవార్డును అందుకున్నారు. ఆమెరికా కాలమానం ప్రకారం గురువారం లాస్‌  ఏంజెల్స్‌లో సిడ్నీ తుదిశ్వాస విడిచారని బహ్మాస్‌ ప్రధానికి సమాచార డైరెక్టర్‌ అయిన ల్యాట్రే రాప్‌ామింగ్‌ తెలిపారు.  సిడ్నీ తండ్రి బహ్మాస్‌కు చెందిన టమాట రైతు కుటుంబానికి చెందినవారు. సిడ్నీ పుట్టి పెరిగింది మాత్రం అమెరికాలోనే. సిడ్నీ ది డెఫియంట్‌ ఒన్స్‌, ఎ ప్యాచ్‌ ఆఫ్‌ బ్లూ, ఎ రైజిన్‌ ఇన్‌ ద సన్‌ లాంటి పలు చిత్రాల్లో నటించారు.

                        1927 ఫిబ్రవరి 20న జన్మించిన పాయ్‌టర్‌ బాల్యంలో కటిక పేదరికాన్ని అనుభవించారు. ఒక సంవత్సరమే స్కూలుకు వెళ్లాడు. పేదరికం, నిరక్షరాస్యతను అధిగమించి హాలీవుడ్‌లో అత్యున్నత శిఖరాలకు చేరిన పాయ్‌టర్‌కు 2009లో అమెరికాలో అత్యున్న పౌర పుస్కారం ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ వరించింది. సిడ్నీ మృతి పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతాపం తెలిపారు.

Social Share Spread Message

Latest News