Skip to main content

Namaste NRI

మన శంకర వరప్రసాద్‌గారు నుంచి ఫస్ట్‌ సింగిల్‌ మీసాల పిల్ల

చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ మన శంకర వరప్రసాద్‌గారు. నయనతార కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ మీసాల పిల్ల ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ ఆల్బమ్‌ని స్పెషల్‌ కాన్సెప్ట్‌గా డిజైన్‌ చేయడం విశేషం. ‘మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..’ అంటూ ఈ పాట సాగింది. లెజెండరీ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ పాటను ఆలపించారు. నాస్టాల్జియా, మెలొడీ కలగలుపుగా వస్తున్న ఈ పాట అందరికీ నచ్చుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణం: షైన్‌స్క్రీన్స్‌ అండ్‌ గోల్డ్‌ బాక్స్‌ ఎంటైర్టెన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News