2020 విశ్వ క్రీడల సంబరానికి తెర పడిరది. అన్ని అవరోధాలను అధిగమించి రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను మురిపించిన టోక్యో ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. ఏడాది పాటు వాయిదా పడి ఒక దశలో అసలు జరుగుతాయా లేదా అనే సందేహాలు రేకెత్తినా అడ్డంకి లేకుండా ఆటు కొనసాగడం విశేషం. క్రీడల ప్రారంభానికి ముందు కరోనా కేసులతో బెంబేలెత్తినా ఒక్కసారి పోటీలు మొదలు కాగానే ఎలాంటి సమస్య రాకుండా అందరి దృష్టి ఫలితాలపైనే నిలవడం ఈ క్రీడలు విజయవంతం అయ్యాయనడానికి పెద్ద సంకేతం. టోక్యో గవర్నర్ యురికో కొయికె ఒలింపిక్ జెండాను వచ్చే ఒలింపిక్స్ జరిగే పారిస్ మేయర్ అనె హిడాల్గోకు అందించడంతో లాంఛనం పూర్తయింది.