ప్రతి ఒక్కరికీ గుండె ఎడమవైపున ఉంటుంది. కానీ అమెరికాకు చెందిన క్లేరీ మాక్ అనే యువతికి మాత్రం గుండె కుడివైపున ఉంది. వినడానికి ఆశ్చార్యం ఉన్నా ఇది వాస్తవాం. షికాగోకు చెందిన 19 ఏళ్ల క్లేరీ మాక్ గత రెండు నెలలుగా దగ్గుతో బాధ పడుతోంది. దీంతో ఆమె ఆసుపత్రికి వెళ్లి మందులు తీసుకునప్పటికీ నయం కాలేదు. ఈ క్రమంలో మరోసారి వైద్యులను సంప్రదించింది. ఆమెకు ఉపరితిత్తుల వ్యాధి అయివుంటుందని వైద్యులు భావించారు. దీంతో ఆమెకు ఎక్స్ రే తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్న్ రే చూసిన వైద్యులు షాక్ అయ్యారు. క్లేరీ మాక్ కు గుండె కుడివైపున ఉండదాన్ని వారు గుర్తించారు.
సాధారణంగా ఎడమవైపునకు ఉండాల్సిన గుండె క్లారీ మక్‌కు మాత్రం కుడి వైపు ఉండడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన క్లేరీ నమ్మలేకపోయింది. కుడివైపున గుండె ఉండడంతో ఆందోళన చెందింది. అయితే అదేమీ ప్రమాదకరం కాదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. గుండె కుడివైపున ఉండడాన్ని వైద్యశాస్త్రంలో డెక్న్ టో కార్డియా అంటారని వైద్యులు తెలిపారు.