Namaste NRI

ఆకట్టుకుంటున్న ఉగ్రం సెకండ్ సింగిల్ అల్బెలా అల్బెలా

అల్లరి  నరేష్‌, మిర్నా మీనన్‌ జంటగా నటిస్తున్న సినిమా ఉగ్రం. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఎమోషనల్‌ యాక్షన్‌ మూవీగా దర్శకుడు విజయ్‌ కనకమేడల రూపొందిస్తున్నారు.  టీజ‌ర్‌లో ఉగ్రం ఇంటెన్స్‌తో పాటు యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఉండ‌నుంద‌ని ప్రజంట్ చేయగా, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని కూడా సినిమా ఆక‌ట్టుకునేలా ఉంటుంద‌ని పాట‌ల ద్వారా తెలుస్తోంది.మొదటి పాట దేవేరి బ్లాక్‌బస్టర్‌ కాగ, ఉగ్రం సెకండ్ సింగిల్ ఇప్పుడు విడుదలైంది.తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట అల్బెలా అల్బెలాను హీరో నాని విడుదల చేశారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా రేవంత్‌, శ్రావణ భార్గవి పాడారు. డ్యూటీ నుంచి విరామం తీసుకున్న ఓ పోలీస్‌ అధికారి తన కుటుంబంతో సరదాగా సమయాన్ని గడపడాన్ని ఈ పాటలో చిత్రీకరించారు. ఈ పాటలో లొకేషన్స్‌ ఆహ్లాదకరంగా ఉండి ఆకట్టుకుంటాయని చిత్రబృందం చెబుతున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. వేసవి కానుకగా మే 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News