Skip to main content

Namaste NRI

కువైత్ కేబినెట్ కీలక నిర్ణయం

కువైత్‌ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 72 గంటల క్వారంటైన్‌ తప్పనిసరి అనే నిబంధనను రద్దు చేసింది. విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పీసీఆర్‌ టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కరోనా పరీక్షలో నెగెటివ్‌ వస్తే ఎలాంటి క్వారంటైన్‌ ఉండదు. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పీసీఆర్‌ పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే క్వారంటైన్‌ను ముగించవచ్చని తెలియజేసింది.

Social Share Spread Message

Latest News