Skip to main content

Namaste NRI

షూటింగ్‌ పూర్తయిన ప్రేమదేశపు యువరాణి

యామిన్‌ రాజ్‌, కార్తీక్‌ జయంత్‌, ప్రియాంకా రెవరి ముఖ్య తారలుగా సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమదేశపు యువరాణి. ఆనంద్‌ వేమూరి, సీహెచ్‌ హరిప్రసాద్‌ సీహెచ్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తియింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు  మాట్లాడుతూ యామిన్‌, కార్తీక్‌, ప్రియాంక కొత్తవారైనా బాగా నటించారు. కథ హీరోయిన్‌ చుట్టే తిరుగుతుంది. ఆర్‌.పి.పట్నాయక్‌ సోదరుడు అజయ్‌ పట్నాయక్‌ అందించిన సంగీతం మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. ఈ  నెలాఖరులో ఆడియో విడుదల చేస్తాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమాలో ఐదు పాటలు, మూడు ఫైట్స్‌ ఉన్నాయి అన్నారు. లవ్‌, కామెడీ అంశాలు కలబోతగా ప్రతీకార నేపథ్యంలో సాగే చిత్రమిది. త్వరలో విడుదల చేస్తాం అన్నారు. సందీప్‌, రాజారెడ్డి, పవన్‌, యోగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్‌ దేవరకొండ, సంగీతం: అజయ్‌ పట్నాయక్‌. రచన`దర్శకత్వం:సాయి సునీల్‌ నిమ్మల.

Social Share Spread Message

Latest News