Skip to main content

Namaste NRI

ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ ఆ రోజే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది రాజా సాబ్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ విడుదలైంది. హార‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ ది రాజా సాబ్ నుంచి మొట్టమొదటి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ రెబ‌ల్ సాబ్ ను న‌వంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఈ సినిమాకు థ‌మన్ సంగీతం అందిస్తుండ‌గా,  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్, జ‌రీనా వాహాబ్‌, రిద్ది కుమార్ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా బోమ‌న్ ఇరానీ, సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించబోతున్నారు.

Social Share Spread Message

Latest News