రజనీకాంత్ కథానాయకుడిగా అగ్ర నటుడు కమల్‌హాసన్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ధర్మన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ది డెడ్లీ డాక్టర్ అని ఉపశీర్షిక. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలైంది. రజనీకాంత్ నటిస్తున్న 173వ చిత్రమిది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఇందులో రజనీకాంత్ ఆపరేషన్ థియేటర్‌లో చేతిలో రక్తపు మరకలు ఉన్న స్కాల్పెల్ పట్టుకొని చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

కమల్‌హాసన్‌తో నా స్నేహబంధం యాభైఏండ్లుగా కొనసాగుతున్నది. ఈ ప్రయాణంలో ఆయన చేసిన సహాయం, మార్గదర్శకత్వం చాలా గొప్పది. మా స్నేహం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది అన్నారు రజనీకాంత్. ఒకస్టార్ హీరో నిర్మిస్తున్న చిత్రంలో మరో స్టార్ హీరో నటిస్తున్నారని, చరిత్రలో గుర్తుండిపోయే సినిమా అవుతుందని దర్శకుడు అశ్వత్ మారిముత్తు పేర్కొన్నారు. సిమ్రాన్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.





























