వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం గాండీవధారి అర్జున. V12గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నా రు. ఈ చిత్రంలో విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన గాండీవధారి అర్జున ఫస్ట్ లుక్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించిన వరుణ్ తేజ్ ఈ సారి మాత్రం స్టైలిష్ షూట్‌లో చేతిలో పిస్తోల్ పట్టుకొని కనిపిస్తున్నాడు. యాక్షన్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ కూడా షురూ అయినట్టు ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండబోతున్నాయని ఇప్పటికే వరుణ్ ట్రైనింగ్ సెషన్ ఫొటోలతో తెలిసిపోతుంది. వరుణ్‌తేజ్ పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ టీంతో నేతృత్వంలో శిక్షణలో ఉన్నప్పుడు తీసిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథానుగుణంగా యూరప్, బుడాపెస్ట్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌తోపాటు పలు లొకేషన్లలో షూట్ చేసినట్టు ఇన్‌సైడ్ టాక్. కాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
















