Skip to main content

Namaste NRI

బ్రహ్మ ఆనందం నుంచి సెకండ్ సింగిల్… విలేజ్ సాంగ్

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రల్ని పోషించారు. ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం. ఈ చిత్రాన్ని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. సోమవారం విలేజ్‌ సాంగ్‌ అనే రెండో గీతాన్ని అగ్ర సంగీత దర్శకుడు కీరవాణి విడుదల చేశారు. శాండిల్య స్వరపరచిన ఈ పాటకు సురేష్‌ బనిశెట్టి సాహిత్యాన్నందించారు. గ్రామీణ అందాలు, అక్కడి ఆటపాటలు, వినోదంతో ఈ పాట మెప్పించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ తాతామనవళ్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, సంపత్‌రాజ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య పిసపాటి, దర్శకత్వం: ఆర్‌వీఎస్‌ నిఖిల్‌.

Social Share Spread Message

Latest News