Skip to main content

Namaste NRI

సూపర్ సుబ్బు ట్రైలర్ వచ్చేసింది

సందీప్‌కిషన్‌, మిథిలా పాల్కర్‌ జంటగా నటిస్తున్న కామెడీ వెబ్‌సిరీస్‌ సూపర్‌ సుబ్బు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సిరీస్‌ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో సందీప్‌కిషన్‌ సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు అనే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. మాకిపూర్‌ అనే గ్రామానికి టీచర్‌గా వెళ్లిన అతనికి అక్కడ ఎదురైన పరిస్థితులు, జీవితాన్ని మార్చే సంఘటనల నేపథ్యంలో ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది.
ఈ సిరీస్‌లో సాధారణ ప్రజలు మాట్లాడటానికి సంకోచించే ఓ సీరియస్‌ అంశాన్ని హాస్యం,

భావోద్వేగాలు మేళవించి చెప్పే ప్రయత్నం చేశామని, సమస్యను పరిష్కరించాలనుకొని తానే ఇబ్బందుల్లో చిక్కుకునే ఉపాధ్యాయుడిగా తన పాత్ర ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని సందీప్‌కిషన్‌ తెలిపారు. హాస్యంతో పాటు మానవ సంబంధాల ఆవశ్యకతను చర్చించే సినిమా ఇదని కథానాయిక మిథిలా పాల్కర్‌ పేర్కొన్నది. ఈ సిరీస్‌లో బ్రహ్మానందం, గెటప్‌ శ్రీను, మానస చౌదరి తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. మల్లిక్‌రామ్‌ దర్శకత్వం వహించారు.

Social Share Spread Message

Latest News