Namaste NRI

మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం అని టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో కేసీఆర్‌ మాట్లాడిన తీరు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ పరిపాలనలో జరిగిన అభివృద్ధి తెలుసునని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.  కేసీఆర్‌ చేసే అభివృద్ధి,సంక్షేమం చాలు మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలవడానికి అని అన్నారు. కేసీఆర్‌ అన్నట్టు కాంగ్రెస్‌ ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నారు. బీజేపీ దేశానికి ఏమీ చెయ్యట్లేదు, అధికారంలో లేని రాష్ట్రానికి ఏమన్నా చేస్తది అని నమ్మే స్థితిలో ప్రజలు లేరు.  మునుగోడు ప్రజలు అన్ని గమనిస్తూ రాబోయే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కి పట్టం కడుతారు అని తెలిపారు. నల్గొండ జిల్లాకు వస్తే మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఒకనాడు ఫ్లోరైడ్‌ నీళ్ల వల్ల నడుములు వంగిపోయి.. ఏ విధంగా బాధపడ్డారో కేసీఆర్‌ కళ్లారా చూసారని, అందుకే ఈ జిల్లా జీవస్మరణ సమస్యగా మారిన ఫ్లోరైడ్‌ రస్కసిని పారదోలారని నాగరాజు తెలిపారు.

Social Share Spread Message

Latest News