అగర్రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ నగరంలో పార్టీ జరిగింది. మాస్ షూటింగ్లో ఇద్దరు మరణించినట్లు పిట్స్బర్గ్ పోలీసులు తెలిపారు. మృతులిద్దరూ మైనర్ బాలురని, మరో 9 మంది గాయపడ్డారని తెలిపారు. పార్టీలో 200 మందికి పైగా పాల్గొన్నారని, చాలా మంది టీనేజ్ వారేనని వెల్లడిరచారు. పార్టీ వేదిక బయట కూడా పలు రౌండ్ల కాల్పులు జరిగాయని తెలిపారు. పిస్టల్స్, రైఫిల్స్‌తో కాల్పులకు పాల్పడినట్లు షెల్ కేసింగ్‌ల ద్వారా తెలుస్తున్నదని అన్నారు. ఇద్దలు బాలురు అక్కడ చనిపోయినట్లు తెలిపారు. మృతుల్ని ఇంకా గుర్తించలేదన్నారు. కాల్పుల నేపథ్యంలో జనం పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు గాయపడ్డారు.














