డిఫెండిరగ్ చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం కాగా, స్వల్ప చికిత్స అనంతరం నొప్పి తిరగబెట్టింది. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చడంతో వరల్డ్ నంబర్ 6 యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు రెండు సార్లు ఛాంపియన్ వీనస్ విలియమ్స్‌కు వైల్డ్‌కార్డ్ లభించింది. 41 ఏళ్ల వీనస్ 2000, 2001లో ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె ప్రస్తుత డబ్ల్యూటీఏ ర్యాంకు 112. యుఎస్ ఓపెన్ ఈ నెల 30న ఆరంభం కానుంది.