Skip to main content

Namaste NRI

అమెరికాలో మరోసారి కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి మిసిసిప్పీలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. లేలాండ్‌ అనే చిన్న నగరంలో ఫుట్‌బాల్‌ ఆట ముగిసిన వెంటనే రద్దీగా ఉన్న ఒక వీధిలోని ఓ స్కూల్‌ ప్రాంగణంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని మేయర్‌ జాన్‌ లీ తెలిపారు. లేలాండ్‌లో అసాధారణ రద్దీ నెలకొంది. అక్కడి పాఠశాలలు పూర్వ విద్యార్థులను పిలిచి స్వాగతించడమే కాక, ఫుట్‌బాల్‌ ఆటలు, కమ్యూనిటీ ఈవెంట్‌లు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో వేడుకలు జరుపుకుంటున్న పాఠశాలలో ఈ కాల్పులు జరిగాయి.

Social Share Spread Message

Latest News