Skip to main content

Namaste NRI

ఇప్పట్లో మాత్రం ఆ అవసరం లేదు.. జస్టిస్ ట్రూడో

కరోనా టీకాకు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న నిరసనలపై మిలటరీని ప్రయోగించాల్సిన అవసరం లేదని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పట్లో ఆ అవసరం లేదన్నారు. వ్యాక్సినేషన్‌కు, కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది మంది జరుపుతున్న నిరసనలతో కొన్ని వారాలుగా కెనెడా సతమత మవుతోంది. ట్రూడో ప్రభుత్వం వైదొలగాలని వీరి డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి ట్రంప్‌ లాంటి వారి మద్దతు కూడా లభించింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఫెడరల్‌ ప్రభుత్వాలు సాయం కోరితే అప్పుడే మాత్రమే మిలటరీ ఉపయోగంపై ఆలోచిస్తామని తెలిపారు. నిరసనలపై మిలటరీ ప్రయోగం సహా అన్ని మార్గాలను ఆలోచిస్తున్నామని  గతంలో  పోలీసులు చెప్పారు.

Social Share Spread Message

Latest News