దేశాధ్యక్షుడి భవనంపై జరిగిన డ్రోన్ల దాడిపై రష్యా తీవ్రంగా స్పందించింది. జెలెన్‌స్కీని చంపడం తప్ప మాకు మరో ఆప్షన్ లేదు అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మెద్వెదేవ్ ప్రకటించారు. లొంగిపోతామనే ప్రకటన పత్రంపై వారు సంతకం కూడా చేయాల్సిన అవసరం లేదని, జర్మనీ నియంత హిట్లర్ కూడా అలాగే చేశాడని, ఆయనకు ఎల్లప్పుడూ కొందరు ప్రత్యామ్నాయంగా ఉంటారని మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు. క్రెమ్లిన్‌పై జరిగిన దాడి రష్యా సమాజంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ముందు జాగ్రత్త చర్యగా పుతిన్‌ను సమీప బంకర్‌కు తరలించారు.































