శ్రీరామ్, మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం అనుకున్నవన్ని జరగవు. జి.సందీప్ దర్శకుడు. శ్రీ భారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కిరీటి, మిర్చి హేమంత్, గౌతమ్‌రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. అనూహ్య మలుపులతో కథ సాగుతుంది. వినోదానికి పెద్దపీట వేశాం. నటీనటులు కొత్తవారైనా చక్కటి పర్‌ఫార్మెన్స్ కనబరిచారు అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, కథ, దర్శకత్వం: జి.సందీప్.














