Skip to main content

Namaste NRI

తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమా: నీరజ కోట

గత ఏడాది తమిళంలో విడుదలైన డా డా చిత్రం మంచి విజయం సాధించింది. కవిన్‌, అపర్ణదాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జేకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత నీరజ కోట తెలుగులో పా పా పేరుతో విడుదల చేయబోతున్నారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. హృదయాన్ని స్పృశించే భావోద్వే గాలుంటాయి. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి. లవ్‌, ఎమోషన్స్‌, కామెడీ ప్రధానంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుం ది  అని నిర్మాత తెలిపారు. భాగ్యరాజా, వీటీవీ గణేష్‌, ఐశ్వర్య, ప్రదీప్‌శక్తి తదితరులు నిర్మిస్తున్నారు. జనవరి 3న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: జెన్‌ మార్టిన్‌, దర్శకత్వం: గణేష్‌ కె బాబు.

Social Share Spread Message

Latest News