ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా భారీగానే నష్టపోయింది. ముఖ్యంగా ఇరు వర్గాలు తమ సైనిక బలగాలను చాలా వరకు కోల్పోయినట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. యుద్ధం కారణంగా భారీ స్థాయిలో రష్యన్ బలగాలను కోల్పోయామని, జరిగిన ఘటన చాలా విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే యుద్ధ ప్రారంభంలో ఇంత నష్టం జరుగుతుందని ఊహించనట్లు తెలిపారు. ఇక తొందర్లోనే తమ యుద్ద లక్ష్యాలను చేరుకోనున్నట్లు ఆయన తెలిపారు.














