Skip to main content

Namaste NRI

అమెరికా ముందున్న ఆప్షన్‌ ఇదే..!

ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అగ్ర రాజ్యం  అమెరికా ఖజానా ఖాళీ అవుతుందా? అమెరికా  ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున కొట్టుమిట్టాడుతోందా? అంటే,  అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అమెరికా ముందు పొంచివున్న ఈ ఆర్థిక ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఇప్పటికిప్పుడు డెబిట్ సీలింగ్‌ పెంచుకోవడం ( రుణ గరిష్టపరిమితి) ఒక్కటే మార్గమని ఆ దేశ ఆర్థిక మంత్రే స్వయంగా వెల్లడించారు. కొత్తగా అప్పులు చేసేందుకు వీలుగా డెబిట్‌ సీలింగ్‌ పెంపునకు చట్టసభలు ఆమోదం తెలిపితేనే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని తెలిపారు. అమెరికా దివాళా తీస్తే,  ఆ ఒక్కో దేశమే కాదు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావాల్సి వస్తుంది. కాబట్టి అమెరికా రుణ పరిమితి పెంపునకు ఆ దేశ చట్టసభలు ఆమోదం తెలపడం ఇప్పుడు చాలా అత్యవసరమని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Social Share Spread Message

Latest News