Skip to main content

Namaste NRI

మన చరిత్ర ఆధారంగానే తీసిన సినిమా ఇది : అభిషేక్‌ నామా

విరాట్‌కర్ణ హీరోగా అభిషేక్‌ నామా దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ నాగబంధం. నభానటేష్‌, ఐశ్వర్య మీనన్‌ కథానాయికలు. కిశోర్‌ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థాంక్స్‌మీట్‌లో విరాట్‌కర్ణ మాట్లాడారు. కొత్తవాళ్లమంతా కలిసి భారీ ఖర్చుతో ఈ కొత్త ప్రయత్నం చేశాం. అనంతపద్మనాభస్వామి తెరపై కనిపిస్తుంటే ప్రేక్షకులు చెప్పులు విడిచి చూస్తున్నారు. వారి కళ్లలో ఆనందభాష్పాలు కనిపిస్తున్నాయి. ఇంతకు మించిన భావోద్వేగం ఏముంటుంది? హరహర మహాదేవ నినాదంతో థియేటర్లు మారుమోగుతుంటే ఇంతమించిన అనుభూతి ఏముంటుంది? దర్శకుడు అభిషేక్‌ గొప్ప విజన్‌తో ఈ సినిమా తీశారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, ైక్లెమాక్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి అని అన్నారు.

సినిమాకు అద్భుతమైన స్పందన వస్తున్నది. ఫస్టాఫ్‌లో కాస్త లెన్త్‌ ఎక్కువైంది. దాంతో ప్రేక్షకుల సలహా మేరకు కాస్త తగ్గించాం. ైక్లెమాక్స్‌ కూడా ట్రిమ్‌ చేశాం. ఇది ఫిక్షనల్‌ స్టోరీ కాదు. ఆఫ్ఘన్‌లు మన దేశంపై దాడికి తెగబడ్డప్పుడు. ఆదిశంకరాచార్యులవారు నాగసాధువులనే వర్గాన్ని ఏర్పాటుచేసి, మన దేవాలయాలను రక్షించారు. మన చరిత్ర ఆధారంగానే తీసిన సినిమా ఇది. నేటి తరానికీ, రానున్న తరానికి కూడా మన చరిత్ర తెలియానే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఇది అని దర్శకుడు అభిషేక్‌ నామా పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events