Skip to main content

Namaste NRI

ఈ తరహా కథ ఇప్పటివరకూ రాలేదు : హీరో సంజోష్‌

సంపూర్ణేష్‌బాబు హీరోగా నటించిన చిత్రం సోదరా. సంజోష్‌ ఇందులో మరో హీరో. మన్‌మోహన్‌ మేనంపల్లి దర్శకుడు. చంద్ర చగంలా నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంపూర్ణేశ్‌బాబు మాట్లాడారు. అన్నదమ్ముల అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించే సినిమా సోదరా. అన్నగా బరువు బాధ్యతలున్న పాత్రను ఇందులో పోషించా. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. జనరల్‌గా నా సినిమాల్లో ఉండే వినోదంతోపాటు భావోద్వేగాలు కూడా ఇందులో ఉంటాయి  అని తెలిపారు.

అమాయకుడైన అన్న, అప్‌డేట్‌ అయిన తమ్ముడు మధ్య నడిచే కథ ఇది. ఈ తరహా కథ ఇప్పటివరకూ రాలేదు. అన్నదమ్ములు కలిసుండాలనేది ఈ కథలో నీతి అని మరో హీరో సంజోష్‌ తెలిపారు.  ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events