కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టించే హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ మొదటి వరుసలో ఉంటుంది. ఆమె అందం, అభినయం అలాంటిది మరి. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ టైగర్ 3 లో జోయా అనే పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు అదరిపొయే యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించటమే కాదు, కను రెప్ప వేయకుండా వావ్ అనిపించేంత అందంతో ఆకట్టుకునేంత ఆకర్షణీయంగా ఆమె కనిపించనుంది. దీనికి అక్టోబర్ 23న ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న లేకే ప్రభు కా నామ్ పాట ఓ ఉదాహరణగా నిలవనుంది. ఈ పాట రిలీజ్ తర్వాత ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుందని మేకర్సే చెబుతున్నారంటే, ఇందులో ఆమె ఎలా మెస్మరైజ్ చేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాటలో కత్రినా కైఫ్ ఒకట్రెండు కాదు, ఏకంగా 7 అద్భుతమైన లుక్స్‌తో అలరించనుందట. ఆమె ఎంటైర్ కెరీర్‌లో ఈ సాంగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరేట్ సాంగ్ అని స్వయంగా కత్రినానే చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూలేకే ప్రభు కా నామ్ విజువల్‌గా ప్రేక్షకులను అలా కట్టిపడేస్తుంది. అందుకనే నా ఫేవరేట్ సాంగ్స్‌లో ఇదొకటి. టర్కీలోని కాప్పడోసియా ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు. మాషాల్లా, స్వాగ్ సే స్వాగత్ పాటల తర్వాత నా ఫేవరేట్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్‌తో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అనితా ష్రాఫ్ అజానియా ఈ పాటలో నన్ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ పాటలో నన్ను ఆమె ఏకంగా ఏడు మెస్మరైజింగ్ లుక్స్‌లో చూపించారు. దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది. టైగర్ ఫ్రాంచైజీ నుంచి వచ్చే పాట ఎప్పుడూ చార్ట్ బస్టర్‌గా నిలుస్తుంది. అదే కోవలో లేకే ప్రభు కా నామ్ పాటను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ పాటను చిత్రీకరించిన తీరు, టైగర్, జోయా మధ్య ఉండే కెమిస్ట్రీ సరికొత్తగా అలరించనుంది. సల్మాన్‌తో కలిసి డాన్స్ చేయటాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను. లేకే ప్రభు కా నామ్ పాట చిత్రీకరణలో మరచిపోలేని అనుభూతులెన్నో ఉన్నాయని తెలిపింది.














