Skip to main content

Namaste NRI

టైగర్‌ నాగేశ్వరరావు ఫస్ట్‌లుక్‌,  ప్రమోషన్‌ పోస్టర్‌

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. ఈ చిత్రం మేజిస్టిక్‌ ఫస్ట్‌లుక్‌ ప్రమోషన్‌ పోస్టర్‌, వీడియోను రాజమండ్రిలో వినూత్న పద్దతిలో విడుదల చేశారు. ఇందుకోసం మేకర్స్‌ ఓ రైలును అద్దెకు తీసుకోవడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ  ఇది టైగర్‌ నాగేశ్వరరావు ఒరిజినల్‌ బయోపిక్‌. చాలా రియల్‌గా నేచురల్‌గా, వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని సినిమా వుంటుంది. ఈ రస్టిక్‌ స్టోరీలో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. రాజమండ్రి బ్రిడ్జ్‌ని సెట్‌ వేసి పెద్ద యాక్షన్‌ సీక్వెన్స్‌ని షూట్‌ చేశాం. అది అల్టిమేట్‌ అవుట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఫర్‌ ఎవర్‌. తప్పకుండా ఇది రవితేజ అభిమానుల ఆకలి తీర్చే సినిమా చెప్పుకోవచ్చు  అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ  టైగర్‌ నాగేశ్వరరావు సినిమా నాకు ప్రత్యేకమైనది. దర్శకుడు వంశీ సోదరుడు లాంటి వాడు. నాలుగేళ్లు నాతో ప్రయాణం చేశాడు. రవితేజ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ సినిమా ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లోని డిక్షన్‌, బాడీలాంగ్వేజ్‌ ఈ చిత్రంలో కనిపించదు. టైగర్‌ నాగేశ్వరరావులో కొత్త రవితేజ కనిపిస్తారు అన్నారు.

Social Share Spread Message

Latest News