Namaste NRI

పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో

యువ కథానాయకుడు నాగశౌర్య పెళ్లి కబురు వినిపించారు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఏడడుగులు వేయనుననట్లు అధికారికంగా ప్రకటించారు. వీరి వివాహం ఈ నెల 20న ఉదయం 11:25 గంటలకు జరగనుంది. ఈ వేడుకకు బెంగళూరులోని జెడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో నాగశౌర్య పెండ్లి జరగనుంది. నవంబర్‌ 19న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేశామని నాగశౌర్య కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్ది మంది సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలిసింది. బెంగళూరుకు చెందిన అనూష  ప్రస్తుతం ఇంటీరియల్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. అయితే వధువు అనూష శెట్టి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events