Skip to main content

Namaste NRI

రేపటి తరాలకి తెలియాలనే… రజాకార్‌

సమర్‌వీర్‌ క్రియేషన్స్‌ పతాకంపై బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, సీనియర్‌ నటి  ఇంద్రజ ప్రధాన పాత్రల్లో రూపొందించిన రజాకార్‌ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ నెల 24న నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనలో రజాకార్ల  ఆకృత్యాల్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాం. రేపటి తరాలు రజాకార్ల ఆకృత్యాల్ని తెలుసుకుని, అలాంటివాళ్లు రాకుండా జాగ్రత్త పడాలన్నదే ఈ సినిమా వెనక ఉద్దేశం అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా కు ఎన్నో అవార్డులొచ్చాయి. తెలంగాణ చరిత్రలో గొప్ప వీరులకు సంబంధించిన 20 కథలు నా దగ్గర ఉన్నాయి. అవకాశాన్ని బట్టి వాటిని సినిమాలుగా తెరకెక్కిస్తా  అన్నారు. ఇంద్రజ  మాట్లాడుతూ రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్రలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు.    

Social Share Spread Message

Latest News