శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు జంటగా నటిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. పవన్ కల్యాణ్ ఖుషి విడుదల రోజున థియేటర్ దగ్గర టికెట్ల హంగామా చుట్టూ సాగే కథతో రూపొందినట్లు స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఆకట్టుకోవడానికి సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షో టిక్కెట్లను సంపాదించే క్రమంలో హీరో పడే ఇబ్బందుల నేపథ్యంలో కథ నడుస్తుందన్నారు. వెన్నెకి కిషోర్, తనికెళ్ల భరణి, మహేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మజ్జా మజ్జా పాటకి మంచి స్పందన లభిస్తోంది. చిత్రం తప్పకుండా వినోదం పంచుతుందని సినీ వర్గాలు తెలిపాయి. శ్రీజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీ జ నిర్మిస్తున్నారు. వంశీధర్ గౌడ్`లక్ష్మీ నారాయణ దర్శకులు. ఈ చిత్రానికి కథ: అనుదీప్ కేవీ, స్క్రీన్‌ప్లే: అనుదీప్ కేవీ, వంశీధర్‌గౌడ్, సంగీతం: రాధన్, సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి, సమర్పణ: ఏడిద శ్రీరామ్, దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ. పి.














