Skip to main content

Namaste NRI

శాంతి బోర్డు హామీ ఇచ్చిందన్న ట్రంప్‌

గాజాలో మానవతావాద, పునర్నిర్మాణ యత్నాల కోసం ఐదు బిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక సాయం అందించేందుకు శాంతి బోర్డు లోని సభ్యదేశాలు హామీ ఇచ్చాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. బోర్డు సభ్యులు తొలిసారిగా వాషింగ్టన్‌లో సమావేశమవుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. ఆ సమావేశంలో సాయంపై ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. గాజాలో భద్రత, శాంతి కోసం ఏర్పాటు చేసే అంతర్జాతీయ స్థిరీకరణ దళం, స్థానిక పోలీసింగ్‌ వ్యవస్థ కోసం వేలాది మంది సిబ్బందిని పంపేందుకు కూడా బోర్డులోని సభ్య దేశాలు అంగీకరించాయని ఆయన తెలియజేశారు. బోర్డు సామర్ధ్యం అపరిమితమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 19వ తేదీ నేను మరోసారి బోర్డు సభ్యులను కలుస్తాను. ఆ సమావేశంలోనే ఆర్థిక సాయంపై ప్రకటన వెలువడుతుంది’ అని ట్రంప్‌ చెప్పారు. ప్రభుత్వ అధినేతలు సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు.

Social Share Spread Message

Latest News