Skip to main content

Namaste NRI

TTA Mega Convention 2026 Day3 Grand Finale: ఘనంగా శ్రీ శ్రీనివాస కల్యాణం, ఆలరించిన కీరవాణి మ్యూజికల్ కాన్సర్ట్

నార్త్ కరోలినా లోని షార్లెట్ నగరం వేదికగా జరుగుతున్న TTA మెగా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం బాంకెట్ డిన్నర్ కు మంచి స్పందన లభించింది. ప్రముఖ ప్రవాస తెలుగు వారు, ఇండియా నుండి వచ్చిన ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖుల తో సందడిగా సాగింది , యాంకర్స్ సుమా, రవి, లావణ్య ప్రోగ్రామ్ ని మంచిగా నిర్వహించారు. కన్వెన్షన్ రెండోరోజు ఉదయం నిర్వహించిన ‘శోభా యాత్ర’ ప్రవాస తెలుగువారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ పండుగ వాతావరణంలో జరిగిన శోభా యాత్రతో కన్వెన్షన్ ప్రారంభం అట్టహాసంగా సాగింది.తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో, బతుకమ్మలను ధరించి శోభా యాత్రలో పాల్గొన్నారు.

అమెరికా, భారత జాతీయ జెండాలను చేతబూని, ‘టీటీఏ యూత్ కమిటీ’ బ్యానర్లతో యువత ప్రదర్శించిన యాత్ర అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ వాయిద్యాలైన డోలు, సన్నాయి వాయిద్యాల నడుమ జరిగిన ఈ యాత్ర, చార్లెట్ వీధుల్లో తెలుగుదనాన్ని చాటిచెప్పింది. కార్యక్రమనికి హాజరైన ప్రముఖులు సందేశాన్ని అందించారు ఈ వేడుకలకలను అద్భుతంగా నిర్వహిస్తున్న కార్యవర్గ సభ్యులను ప్రశంసించారు. ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, రాంగోపాల్ వర్మ ప్రసంగించారు. సినీ దర్శకుడు దిల్ రాజు, హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రీ విష్ణు, సందీప్ కిషన్, ప్రముఖ వైద్యులు డా. నాగేశ్వర్ రెడ్డి, డా. గురవారెడ్డి వేడుకలకు హాజరై ప్రసంగించారు. టిటిఏ ఫౌండర్ డా. పైళ్ల మల్లారెడ్డిని, టిటిఏ పూర్వ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, హరినాథ్ పొలిచెర్ల , మహేందర్ రెడ్డి ముసుగు,ఘనంగా సన్మానించారు, బ్యూటీ పేజెంట్ విజయవంతంగా నిర్వహించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, నల్గొండ గద్దర్ నర్సన్న , రసమయి బాల కిషన్ గాయకులు బృందం తమ తెలంగాణ పాటలతో అలరించారు. ఆరెంజ్ బ్యాండ్ మ్యూజిక్ అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఆలరించినది , మరియు వేడుకలకు హాజరైన ప్రముఖులను ఘనంగా సన్మానించారు. టిటిఏ వేడుకల్లో భాగంగా చివరిరోజు శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కల్యాణం నిర్వహించారు. చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కల్యాణంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది , కన్వీనర్ ప్రవీణ్ చింత, టీటీఏ వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వజరీ కౌన్సిల్ చైర్ డా. విజయ్ పాల్ రెడ్డి, కోచైర్ డా. మోహన్ రెడ్డి పటోళ్ల , సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, వంశీ రెడ్డి కంచరకుంట్ల , శ్రీని అనుగుల సారధ్యం మరియు సలహాలతో కన్వెంన్షన్ 2026 అట్టహాసంగా నిర్వహించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events