Namaste NRI
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు హెటిరో డ్రగ్స్ అధినేత బి.పార్థసారథిరెడ్డి రూ. కోటి విరాళంగా అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డిలకు దాత విరాళం చెక్కును అందించారు.