ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీల మధ్య గతకొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ ఇండియా చీఫ్‌గా వ్యవహరిస్తోన్న మనీశ్ మహేశ్వరికి ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మునిశ్ మహేశ్వరి ఇక నుంచి అమెరికా కేంద్రంగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని ట్విటర్‌కు దక్షణి కొరియా, జపాన్, ఆసియా పసిఫిక్ విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్న యూ`సన్ పేర్కొన్నారు.