Skip to main content

Namaste NRI

రీ ఎంట్రీలో అదరగొడుతున్న ఉదయభాను.. త్రిబాణధారి బార్బరిక్ సినిమా నుంచి ఫస్ట్ లుక్

ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు పాత్ర ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్‌. మోహన్‌ శ్రీవత్స దర్శకుడు. విజయ్‌పాల్‌ రెడ్డి అదిధాల నిర్మాత. ఈ సినిమా నుంచి ఉదయభాను పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.  ఈ సినిమాలో ఆమె వాకిలి పద్మ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తుందని, కథాగమనంలో కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. చాలాకాలం విరామం తర్వాత ఉదయభానుకు మంచి పాత్ర దక్కిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. సత్యరాజ్‌, వశిష్ట ఎన్‌ సింహా తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: ఇన్ఫ్యూషన్‌ బ్యాండ్‌, రచన-దర్శకత్వం: మోహన్‌ శ్రీవత్స.

Social Share Spread Message

Latest News