Skip to main content

Namaste NRI

నా కెరీర్‌లో హయ్యెస్ట్‌ గ్రాసింగ్‌ ఫిల్మ్‌గా ఉగ్రం : అల్లరి నరేశ్‌

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఉగ్రం. విజయ్‌ కనకమేడల దర్శకుడు. ఈ చిత్రాన్ని  షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఈ కథ అనుకున్నప్పుడే నరేష్‌ను ఊహించుకున్నా. యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌, ఫ్యామిలీ డ్రామా ఉంటాయి. కథాగమనంలో హీరోయిన్‌ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది’ అన్నారు. మిస్సింగ్‌ కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నా యని, ఈ కథపై విస్త్రతంగా పరిశోధన చేశానని రచయిత తూమ్‌ వెంకట్‌ తెలిపారు. తమ సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని నిర్మాతలు చెప్పారు.

నరేష్‌ మాట్లాడుతూ నాంది  సినిమా చేసినప్పుడు ఎలా గర్వంగా ఫీలయ్యానో ఇప్పుడు అదే భావనతో ఉన్నా. నవరసాల్లో హాస్యాన్ని పండించడం చాలా కష్టం. ఏడిపించడం సులువు. కామెడీ చేసిన వారు నవరసాల్లో దేనినైనా పండించగలరు. నా కెరీర్‌లో గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు కథాంశాల ఎంపికలో కొత్తదారులను చూపించాయి. ఈ క్రమంలోనే నాంది, ఉగ్రం లాంటి సినిమాలు చేసే అవకాశం దొరికింది. ఉగ్రం లో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చాలా సహజంగా అనిపిస్తాయి. ఈ సినిమాలో నేను సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తా. ఇందులో నటనాపరంగా నా ఉగ్రరూపం చూస్తారు అన్నారు. ఉగ్రం తన కెరీర్‌లో హయ్యెస్ట్‌ గ్రాస్ సాధించిన సినిమాగా నిలువడం ఖాయమని అల్లరి నరేశ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్‌, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఉగ్రం చిత్రానికి టూమ్‌ వెంకట్‌, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్‌ అందిస్తున్నారు. అల్లరి నరేశ్‌ టైటిల్‌కు తగ్గట్టుగా తనలోని డ్యుయెల్‌ షేడ్స్‌తో ఉగ్రరూపంలో శత్రువులను చీల్చి చెండాడబోతున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events