Skip to main content

Namaste NRI

రష్యాకు ఉక్రెయిన్‌ హెచ్చరిక..  అది నిజం కాదు

రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌ను పునర్నిర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అందుకు అవసరమైన ప్రతిపైసా రష్యా నుంచే వసూలు చేస్తామని అన్నారు. రష్యా దాడులు నానాటికీ తీవ్రమవుతున్న వేళ దేశ ప్రజలనుద్దేశించి జెలెన్‌స్కీ ప్రసంగించారు ఉక్రెయిన్‌ను పూర్తిగా ధ్వంసం చేయాలని రష్యా అనేక మార్లు ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదన్నారు. ఇంత జరిగిన తర్వాత తాము భయపడుతూ, రష్యాకు లొంగిపోతామని ఎవరైనా అనుకుంటే అది నిజం కాదని అన్నారు. ఉక్రెయిన్‌ ప్రజల గురించి వారికి ఏమీ తెలియదన్నట్లేనని వ్యాఖ్యానించారు. అసలు ఉక్రెయిన్‌ గురించి పుతిన్‌కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా ఈ దాడుల్లో మన ఆస్తులను ధ్వంసం చేశారు. కానీ, ఈ యుద్ధం తర్వాత ప్రతి ఇంటిని, ప్రతి వీధినీ, ప్రతి నగరాన్ని పునర్మిర్మించుకుంటాం. మేం రష్యాకు చెప్పేది ఒక్కటే. నష్టపరిహారం అనే పదాన్ని గుర్తుంచుకోండి. మీరు మా దేశంలో చేసిన ప్రతి విధ్వంసానికి ఉక్రెయిన్‌ పౌరుడికి కగలించిన ప్రతి నష్టానికి పూర్తి చెల్లింపులు చేయూల్సిందే అని హెచ్చరికలు చేశారు.

Social Share Spread Message

Latest News