Skip to main content

Namaste NRI

అన్‌స్టాపబుల్‌ సినిమా షురూ 

సన్నీ హీరోగా అన్‌స్టాపబుల్‌ (నోడౌట్‌ 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌) అనే చిత్రం  షూరు అయింది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రంజిత్‌ రావ్‌.బి నిర్మించిన ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆక్షా ఖాన్‌, సప్తగిరి, పృథ్వి, పోసాని కృష్ణమూరళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బి.గోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ క్లాప్‌ కొట్టారు. నటుడిగా నేను 100 శాతం కష్టపడి పని చేస్తాను. ఫలితం అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది అన్నారు వీజే సన్నీ.  డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో ఈ చిత్రం ఉంటుంది. జూలై నెలాఖరుకి సినిమాను పూర్తి చేస్తాం. దసరాకు విడుదల చేస్తాం అన్నారు. మా బ్యానర్‌లో వచ్చే సినిమాలు ప్రేక్షకులు ఎంజాయ్‌చేసేలా ఉంటాయి అన్నారు రంజన్‌ రావ్‌. బి.ఈ చిత్రానికి సహనిర్మాతలు: షేక్‌ రఫి, బిట్టు న్యావనంది, కెమెరా: వేణు మురళీధర్‌. ఈ కార్యక్రమంలో బిత్తిరి సత్తి, భీమ్స్‌, విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News