Skip to main content

Namaste NRI

ఈ నెల 9న అన్‌స్టాపబుల్‌ విడుదల

సప్తగిరి, వీజే సన్నీ హీరోలుగా నటిస్తున్న సినిమా అన్‌స్టాపబుల్‌ . నక్షత్ర, అక్సాఖాన్‌ నాయికలు. రజిత్‌ రావు నిర్మిస్తున్నారు. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. ఈ సందర్భంగా దర్శకుడు డైమండ్‌ రత్నబాబు మాట్లాడుతూ ఈ చిత్ర పోస్టర్‌ చూస్తే దాని నిండా కమెడియన్స్‌ కనిపిస్తారు. ఇండస్ట్రీలోని హాస్య నటులందరినీ పెట్టి ఆద్యంతం నవ్వించాలని చేసిన ప్రయత్నమిది. ప్రతి పాత్ర కథకు ముడిపడి ఉంటుంది. ఇవన్నీ అన్‌స్టాపబుల్‌గా ఉంటాయి. సినిమా చూస్తూ ఎవరికైనా నవ్వు రాకుంటే నాకు ఫోన్‌ చేయమని ఇటీవల ప్రెస్‌మీట్‌లో ఫోన్‌ నెంబర్‌ కూడా ఇచ్చాను. కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది. అని అన్నారు.

            హీరో వీజే సన్నీ మాట్లాడుతూ నేను నాటకరంగం నుంచి టీవీకి అక్కడి నుంచి సినీ పరిశ్రమకు వచ్చాను. బిగ్‌ బాస్‌ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత హీరోగా కొత్త నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు వచ్చాయి. అలా ఈ కథ విన్నాను. కథ విన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. సప్తగిరి ప్రతి సన్నివేశంలో ఇన్వాల్వ్‌ అయి చేస్తుంటారు. ఇద్దరం పోటీ పడి నటించాం. నేనూ, సప్తగిరి చిచ్చా, మచ్చా అనే పాత్రల్లో కనిపిస్తాం.సినిమా ఆద్యంతం మా ఇద్దరి పాత్రల చుట్టూనే తిరుగుతుంటుంది. కథలో మాకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. డబ్బు మా జీవితాలతో ఎలా ఆడుకుంది అనేది వినోదాన్ని పంచుతుంది. సినిమా చివరి వరకు ఫన్‌ రైడ్‌లా ఉంటుంది. ప్రతి పాత్ర నవ్విస్తుంది. ఏటీఎం వెబ్‌ సిరీస్‌లో నా నటన చూసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మెచ్చుకున్నారు. ఆయన ప్రశంస నటుడిగా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ తరహా పాత్రలైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. హీరోగా నటించడంతో పాటు పెద్ద హీరోల చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించాలని ఉంది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా అని చెప్పారు. ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events